: జగన్ కు మళ్లీ నిరాశ
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి మరోసారి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్ బయటకొస్తే సాక్ష్యాలు తారుమారవుతాయన్న సిబిఐ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కేసు దర్యాప్తును నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకూ బెయిల్ కోసం రాకండంటూ సుప్రీంకోర్టు గతంలోనే జగన్మోహనరెడ్డికి సూచించిన సంగతి తెలిసిందే. అయినా ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.