: విజయసాయి.. జూన్5 లోపు లొంగిపోండి: సుప్రీంకోర్టు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డి బెయిల్ ను సుప్రీం కోర్టు ఈ రోజు రద్దు చేసింది. జూన్ 5లోపు లొంగిపోవాలని ఆదేశించింది. విజయసాయి బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లోగా పూర్తి చేసి తుది చార్జిషీటును దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది.