: శ్రీవారిని దర్శించుకున్న సచిన్
క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఈ రోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. చెన్నై మీదుగా ప్రత్యేక విమానంలో ఆయన ముంబాయి వెళతారు.