Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ గా పుట్టా... వర్ల, జూపూడి, కొత్తపల్లి సుబ్బారాయుడులను కూడా వరించిన ఛైర్మన్ పదవులు

  • ఆశావహులను వరించిన పదవులు
  • టీటీడీ ఛైర్మన్ పదవి భర్తీ
  • ఏపీ ఎస్ఆర్టీసీలోని వివిధ రీజియన్ ఛైర్మన్ పదవుల భర్తీ

నామినేటెడ్ పదవుల్లో ఆశావహులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు. గతంలో రాజ్యసభ సీటు రేసులో ఉన్నారంటూ ప్రచారం జరిగిన వర్ల రామయ్యను ఏపీ ఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవి వరించింది. కడపలో టీడీపీని బలోపేతం చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ను కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవి వరించింది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా జూపూడి ప్రభాకర్ నియమితులయ్యారు.

కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడును సీఎం నియమించారు. అలాగే ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ గా దాసరి రాజామాస్టారుని, ఆర్టీసీ కడప రీజియన్‌ ఛైర్మన్‌ గా చల్లా రామకృష్ణారెడ్డిని, ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ ఛైర్మన్‌ గా పార్థసారధిని, ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ ఛైర్మన్‌ గా ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌ ను, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ ఛైర్మన్‌ గా తెంటు లక్ష్మీనాయుడును, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డిని, శాప్‌ ఛైర్మన్‌ గా పి.అంకమ్మ చౌదరిని నియమించారు. 

  • Loading...

More Telugu News