yoga guru ramdev baba: రాందేవ్ బాబాతో కలిసి ‘యోగా’ చేసిన ఎంపీ కవిత!
- నిజామాబాద్ లో ఉచిత యోగ చికిత్స, ధ్యాన శిబిరం
- రాందేవ్ తో కలిసి ఆసనాలు వేసిన కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
- భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
యోగాతో ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత కలుగుతాయని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ లో రాందేవ్ బాబా, పతంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యోగ చికిత్స, ధ్యాన శిబిరం కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. రాందేవ్ తో కలిసి కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేయర్ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ‘ఇంత మంచి కార్యక్రమం జరగడం సంతోషం. మన మనసులో ఉండేటటువంటి శాంతిని మనం ముందుగా తెలుసుకుని, దానిని బయట ప్రపంచానికి తెలియజేస్తే విశ్వశాంతి అవుతుంది. అంతకుమించి ఇంకోటి లేదు. మనల్ని మనకు పరిచయం చేసేటటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి బాబా రాందేవ్ గారు శ్రీకారం చుట్టి, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అన్నారు.
ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో, ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, పసుపు బోర్డు ఏర్పాటుకు తన మద్దతు ఉంటుందని అన్నారు.