Chandrababu: సింగపూర్ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- ఈనెల 12న రాత్రికి చంద్రబాబు పయనం
- మళ్లీ 13న ఏపీకి రానున్న సీఎం
- పలు కీలక ఒప్పందాలపై చర్చించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సింగపూర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు చర్చలు జరపడానికి ఆయన ఈనెల 12 రాత్రికి సింగపూర్ బయలుదేరనున్నారు. ఆ తదుపరి రోజు సింగపూర్‌లో పర్యటించి పలువురితో చర్చలు జరుపుతారు. అదే రోజు రాత్రి ఏపీకి బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నట్లు తెలిసింది. కాగా, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు గతంలోనూ చంద్రబాబు బృందం సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.