: భారత్ లో పర్యటించేటప్పుడు జాగ్రత్త: పాక్ హెచ్చరికలు
పాకిస్థాన్ తన పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో ప్రయాణించాలనుకునేవారు.. అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. భారత్ లో పాక్ సందర్శకుల రక్షణ అపాయంలో పడిందంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెలలో అజ్మీర్ లో జరిగే ఉర్సు ఉత్సవాలకు పాక్ నుంచి 600 మందికి పైగా రానున్నారు.