ఫేస్ బుక్ లో ఇకపై ఫ్రెండ్స్ జాడ తెలుసుకోవడం చాలా కష్టం...!
- ఇందుకు సంబంధించి టూల్ తొలగింపు
- డేటా చోరీకి గురైన ఖాతాలు 8.7 కోట్లు
- ఇకపై యూజర్ల సమాచారానికి కట్టుదిట్టమైన రక్షణ
యూజర్ల సమాచారం తెలుసుకునేందుకు ఇకపై ఫేస్ బుక్ ఎవరినీ అనుమతించదు. లొకేషన్, ఫొటోలు, పోస్టులకు సంబంధించి సమాచారం కావాలని వచ్చే దరఖాస్తుల సమీక్షను కఠినతరం చేసింది. ఫేస్ బుక్ యూజర్లు ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఆధారంగా తమకు తెలిసిన వారి ఫేస్ బుక్ పేజీలను వెతికి పట్టుకోవడం ఎంతో సులభం. అయితే, ఇకపై దీనికీ అవకాశం ఉండదు. సంబంధిత టూల్ ను తొలగించనున్నట్టు మైక్ స్క్రోప్ ఫర్ చెప్పారు.