: కన్నుమూసిన పాక్ ఖైదీ


భారత ఖైదీ చేతిలో గాయపడి గత ఆరు రోజులుగా చావు బతుకుల మధ్య కొట్లాడిన పాక్ ఖైదీ సనావుల్లా ఖాన్ ఈ ఉదయం 6.30 నిమిషాలకు చండీగఢ్ లోని పిజిఐఎమ్ఇఆర్ హాస్పిటల్ లో కన్నుమూశాడు. దాడి అనంతరం కోమాలోకి వెళ్లిన అతడి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తూ వచ్చింది. తమ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పేషెంట్ బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉన్నాడని, అవయవాలు కూడా విఫలం కావడంతో అతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో ఈ నెల 3న జరిగిన ఘర్షణలో భారత ఖైదీ సనావుల్లాపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి విదితమే. సనావుల్లా మృతదేహాన్ని పాక్ కు పంపించడానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆ దేశ హై కమిషనర్ మంజూర్ మీనన్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దాడిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News