విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిజమే.. పోలీసుల నివేదికలో వెల్లడి?
- గతేడాది డిసెంబరు 26న దుర్గ గుడిలో తాంత్రిక పూజలు
- అమ్మవారికి మద్యం, మాంసంతో నైవేద్యం
- పూజలు నిజమేనని నిర్ధారించిన పోలీసులు
- ప్రభుత్వానికి నివేదిక
గతేడాది డిసెంబరు 26 రాత్రి 10:30 గంటల సమయంలో అమ్మవారి అలంకారం తొలగించి తాంత్రిక పూజలు నిర్వహించిన విషయం అప్పట్లో పెను దుమారం రేపింది. పూజ అనంతరం అమ్మవారికి మద్యం, మాంసంతో నైవేద్యం పెట్టిన పూజారులు శుద్ధి చేయడం మర్చిపోవడంతో వ్యవహారం బయటపడింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించిన మాట నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు.