: కొవ్వు పట్టిన వాళ్లే పగలు నిద్రపోతారు
మరీ అలా విస్తుపోకండి... నవీన సమాజంలో... పగలు నిద్రపోయే వారిలో నిస్తేజం అధికంగా కనిపిస్తోందని వాషింగ్టన్ లోని పెస్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ప్రొఫెసర్ అలెగ్జాండ్రోస్ గోంజాన్ చెబుతున్నారు. మళ్లీ ఇలాంటి నవీన సమాజపు పోకడకు అంతర్జాలం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు ముడిపెట్టడం సరికాదు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే.. పగటిపూట నిద్ర ఆటోమేటిగ్గా వచ్చేస్తుందని గోంజాన్ అధ్యయనం ఫలితాలు చెబుతున్నాయి.
అమెరికాలో జరిగిన ఈ పరిశోధన వల్ల.. అధికంగా కొవ్వు పదార్థాలున్న ఆహారం వల్ల పగటి నిద్ర పెరుగుతుందని తేలుతుంది. మీకు ఇలాంటి నిద్ర అలవాటు ఉంటే.. మీ ఆహార విశేషాల్ని క్రాస్‌చెక్ చేసుకోవాల్సిందే. పిండిపదార్థాలు తిన్నవారు మాత్రం చురుగ్గా ఉంటున్నారట. నిద్ర మరియు చురుకుదనం మీద మాంసకృత్తులు మాత్రం ఎలాంటి ఎఫెక్టు చూపిండం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది.