YSRCP: ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంటే అర్థం ఇది! : వైఎస్ జగన్
- మామూళ్లు, లంచాలు తీసుకునే అబ్బాయి అని అర్థం
- ఈ నియోజకవర్గంలో దారుణంగా అవినీతి జరుగుతోంది
- వేల లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెదకూరపాడు లో ఆయన మాట్లాడుతూ, ‘ఈ మధ్య కాలంలో ఎం.ఎల్.ఏ అనే సినిమా విడుదలైంది. మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నది ఈ సినిమా ట్యాగ్ లైన్.
మరి, ఈ నియోజక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంటే అర్థమేంటో తెలుసా!.. మామూళ్లు, లంచాలు తీసుకునే అబ్బాయి. ఈ నియోజకవర్గంలో ఎంత దారుణంగా అవినీతి జరుగుతోందంటే, వేల లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ఎక్కడైనా అవినీతి చేసే వాళ్లు భయపడతారు. కానీ, ఏపీలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. సీఎంకు ఇంత, చినబాబుకు ఇంత, ఎమ్మెల్యేలకు ఇంత వాటాలని ఉన్నాయి’ అని జగన్ ఆరోపించారు.