చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారు : జీవీఎల్ నరసింహారావు
- సీనియర్ రాజకీయనాయకుడినంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు
- రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందనే నాడు మాతో పొత్తు
- ఏపీలో ఆపరేషన్ గరుడ లాంటివి ఏమీ లేవు
- 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదు
నాలుగేళ్లు కేంద్ర మంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీని చూసి ప్రాంతీయ పార్టీలకు గుబులు పట్టుకుందని, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందనే భయంతో 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఏపీలో ఆపరేషన్ గరుడ లాంటివి ఏమీ లేవని, బీజేపీ అంటే కేవలం దడ మాత్రమేనని అన్నారు. 2019లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని ఈ సందర్భంగా జీవీఎల్ స్పష్టం చేశారు.