రాజీనామా లేఖలపై సంతకాలు చేసిన వైసీపీ ఎంపీలు
- స్పీకర్ ఫార్మాట్ లో ఉన్న రాజీనామా లేఖలపై సంతకాలు
- రాజీనామా లేఖలతో పార్లమెంటుకు వచ్చిన ఎంపీలు
- సభ నిరవధిక వాయిదా పడితే.. రాజీనామాల సమర్పణ
ఈ లేఖలతోనే ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు లోక్ సభకు వచ్చారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒకవేళ లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తే, వెంటనే తమ రాజీనామాలను సమర్పించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, సభను నిరవధికంగా కాకుండా... సోమవారానికి ఆమె వాయిదా వేశారు. దీంతో, సోమవారం వరకు వేచి చూసి, తమ కార్యాచరణను అమలు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు.