Jagan: చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే చంద్రబాబు ఆ పని చేయాలి: జగన్

  • మా పార్టీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తారు
  • మా ఎంపీలకు తోడుగా తమ ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించాలి
  • 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మొత్తం దీని గురించి చెప్పుకుంటుంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు తాము ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోందని, చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఓ పని చేయాలని అన్నారు.

తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని, తమ ఎంపీలకు తోడుగా టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నానని జగన్ అన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మొత్తం దీని గురించి చెప్పుకుంటుందని, ప్రత్యేక హోదా వస్తుందని వ్యాఖ్యానించారు. చరిత్ర హీనుడిగా మిగిలి పోకుండా ఉండాలంటే పార్లమెంటు చివరి రోజున స్పీకర్ ఫార్మాట్‌లో తమ ఎంపీలు ఏ విధంగా రాజీనామా లేఖలు సమర్పిస్తారో అదే విధంగా చంద్రబాబు నాయుడు తమ ఎంపీలతో రాజీనామా లేఖలు అందించాలని, అందుకోసం సన్నద్ధం కావాలని సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News