bjp: ఆ విషయంలో బీజేపీ, టీడీపీలది సమానపాత్ర : సీపీఎం నేత మధు
- హోదా విషయంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో, టీడీపీకి అంతే ఉంది
- కేంద్రంపై నిందలు వేయకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి
- టీడీపీతో కలిసి పోరాటాలు చేసేందుకు సిద్ధంగా లేము
ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో బీజేపీ, టీడీపీలు సమానపాత్ర పోషించాయని సీపీఎం నేత మధు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రెండూ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశాయని, ఆ తర్వాత అధికారాన్ని కూడా పంచుకున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో, టీడీపీకి కూడా అంతే పాత్ర ఉందని, కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయకుండా హోదా సాధనకు పోరాడాలని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాము బంద్ తలపెడితే, టీడీపీ సర్కార్ అరెస్ట్ లు చేసిందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పలుసార్లు కోరినప్పటికీ టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే, టీడీపీతో కలిసి పోరాటాలు చేసేందుకు తాము సిద్ధంగా లేమని మధు అన్నారు.