Telugudesam: కిం కర్తవ్యం... ఎంపీలతో భేటీలో జగన్ దిశానిర్దేశం ఇదే!

  • ఎలాంటి అవాంతరాలు వచ్చినా పోరాటమే
  • నిత్యమూ నిరసనలు తెలపండి
  • తెలుగుదేశాన్ని ఎండగట్టండి
  • ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు ఎదురైనా, పోరాటాన్ని కొనసాగించాలని వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో ఎంపీలతో సమావేశమైన ఆయన పార్లమెంట్ లో తదుపరి పాటించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేంత వరకూ వదిలి పెట్టవద్దని జగన్ స్పష్టంగా తన ఎంపీలకు వెల్లడించారు. నిత్యమూ నిరసనలు తెలపాలని సూచించారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు నాలుకల ధోరణిని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి కూడా సీక్రెట్ గా వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన సుజనా చౌదరి వ్యవహారాన్ని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వరప్రసాద్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News