: సీబీఐ.. పంజరంలో చిలుకలా తయారైంది: సుప్రీం వ్యాఖ్య


కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పరిస్థితి పట్ల సుప్రీంకోర్టు సానుభూతి వ్యక్తం చేసింది. సీబీఐ.. పంజరంలో చిలుకను తలపిస్తోందని సుప్రీం నేడు వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నివారించలేని నిస్సహాయస్థితిలో సీబీఐ చిక్కుకుందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులతో పంచుకునేందుకు దర్యాప్తు నివేదిక ఏమీ ప్రగతి నివేదిక కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బొగ్గు కుంభకోణం నివేదికలో ప్రభుత్వ వర్గాల సూచనల మేరకే మార్పులు జరిగి ఉంటాయని సుప్రీం అభిప్రాయపడింది. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాల్సిన తరుణం ఇదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News