BJP: కేంద్ర సర్కారుని చంద్రబాబు విమర్శిస్తుండగా మధ్యలో కల్పించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ
- ఈ రోజు ఏపీ శాసనమండలిలో చంద్రబాబు ప్రసంగం
- బీజేపీతో వైసీపీ నేతల చర్చలపై నిలదీత
- అడ్డుతగిలిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- అవినీతి కేసులున్న నేతలతో మోదీ చర్చలు మంచివి కావన్న చంద్రబాబు
ఈ రోజు ఏపీ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించి, బీజేపీ-వైసీపీ-పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీతో వైసీపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారని చంద్రబాబు చెబుతుండడంతో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అది సరికాదని ఆయన అంటుండడంతో చంద్రబాబు మరింత స్వరం పెంచుతూ వైసీపీ-బీజేపీ మధ్య పెరుగుతోన్న దోస్తీపై ఆధారాలు కనపడుతున్నాయని అన్నారు.
అలాగే, అవినీతి కేసులు ఎదుర్కుంటోన్న వైసీపీ నేతలతో ప్రధాని మంత్రి మోదీ చర్చలు జరుపుతుండడం ఏంటని, ఇలాగైతే కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఎలా అరికడుతుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో స్కామ్ కాంగ్రెస్ అంటూ బీజేపీ, టీడీపీ ప్రచారం చేసిందని, ఇప్పుడు అవినీతికి పాల్పడిన వారితో ఇలా చర్చలు జరుపుతుండడం దేనికి సంకేతాలిస్తున్నట్లని చంద్రబాబు వ్యాఖ్యానించారు.