Chandrababu: మా వైస్ చాన్స్ లర్ నన్ను పిలిచి అడిగిన మాట ఇప్పటికీ గుర్తుంది : టీడీపీ అధినేత చంద్రబాబు

  • అప్పుడు, నాకు లెక్చరర్ పోస్ట్ ఇస్తామన్నారు
  • ఆ ఉద్యోగం నేను చెయ్యనని చెప్పాను
  • నేను ఎమ్మెల్యే నవుతానని ధీమాగా వైస్ చాన్స్ లర్ కు చెప్పా
  • నాటి సంఘటనను గుర్తుచేసుకున్న చంద్రబాబు

యూనివర్శిటీలో విద్యనభ్యసించిన నాటి రోజులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. తమ వైస్ చాన్స్ లర్ కు ఆయనకు జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించారు.

 ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. మా వైస్ చాన్స్ లర్ నన్ను పిలిచి నన్ను ఒక మాట అడిగారు. ‘నువ్వు అప్లై చేస్తే నీకు లెక్చరర్ పోస్ట్ ఇస్తాం’ అని నాతో వైస్ చాన్స్ లర్  అన్నారు. ‘లెక్చరర్ ఉద్యోగం చేసేందుకు నేను సిద్ధంగా లేను..నేను ఎమ్మెల్యే అవుతాను. పోటీ చేస్తున్నాను .. తప్పకుండా ఎమ్మెల్యే అవుతా’ అని సమాధానమిచ్చాను. అప్పుడు, వైస్ చాన్స్ లర్ నవ్వుతూ..‘ఇంత నమ్మకం ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘నాకు నమ్మకం ఉంది’ అని ధీమాగా చెప్పాను.

ఇంకో మాట కూడా మా వైస్ చాన్స్ లర్ నాతో అన్నారు. ‘ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే కాకపోతే, ఇక్కడికి వచ్చి లెక్చరర్ ఉద్యోగం చేసుకో’ అని అనడంతో, ‘మళ్లీ వచ్చే పనే లేదు. తప్పకుండా ఎమ్మెల్యే అయి మీకు కనపడతాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు’ అని సమాధానమిచ్చానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన గురించి చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న సమయంలోలోకేశ్ సహా సభ్యులందరూ బల్లలు చరుస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News