Telugudesam: టీడీపీ సమన్వయ కమిటీ భేటీ.. 'బీజేపీకి ఎదురుగాలి' విషయంపై స్పందించిన చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు

  • యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించిన చంద్రబాబు
  • వివిధ రౌండ్లలో వచ్చిన ఓట్ల లెక్కింపు గురించి అడిగి తెలుసుకున్న సీఎం 
  • దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని వ్యాఖ్య 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీ వ్యవహార శైలి, కేంద్ర ప్రభుత్వ తీరు, యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు, ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. యూపీ, బీహార్లలో వివిధ రౌండ్లలో వచ్చిన ఓట్ల లెక్కింపు గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. బీజేపీకి ఎదురుగాలి తగిలిందని తెలుసుకున్న చంద్రబాబు.. దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News