: ఆ ఎంపీ దేశభక్తి ఇలా ఉంది..!


ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతిని ఏకతాటిపై నిలిపిన గేయాల్లో 'వందేమాతరం' స్థానం భర్తీచేయలేనిది. అలాంటి స్ఫూర్తిదాయక గీతం ఎక్కడ వినిపించినా పైకి లేచి నిలబడడం ద్వారా మనలోని దేశభక్తి భావనను పునరుత్తేజపర్చుకుంటాం. అంతటి ఘనతర గీతం పట్ల ఎవరైనా అగౌరవ పరిచే రీతిలో వ్యవహరిస్తే భరించలేం. చట్టసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలు, ఎమ్మెల్యేలు వందేమాతరం విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, నేడు పార్లమెంటులో ఓ ఎంపీ, వందేమాతరం గీతం వినవస్తుండగా నింపాదిగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయాడు.

సభలో ఉన్న సభ్యులంతా లేచి నిలబడితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుజన్ సమాజ్ వాదీ ఎంపీ షఫీఖ్ ఉర్ రహ్మాన్ సభను వీడడం స్పీకర్ కు ఆగ్రహం తెప్పించింది. ఆ ఎంపీ సంజాయిషీ కోరిన స్పీకర్ మీరాకుమార్.. ఇలాంటి ఘటన పునరావృతం చేయొద్దని హెచ్చరికతో సరిపెట్టారు.

  • Loading...

More Telugu News