: అంజలి పిన్నికి బెదిరింపు కాల్స్


ప్రముఖ దక్షిణాది హీరోయిన్ అంజలి పిన్నికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి పూట ఫోన్ చేస్తూ.. వెంటనే చెన్నై వదిలి వెళ్ళకపోతే పెట్రోల్ పోసి కాల్చి చంపుతామని బెదిరిస్తున్నారని అంజలి పిన్ని భారతీదేవి తెలిపారు. తనకు అలాంటి కాల్స్ రావడంతో ఫోన్ స్విచాఫ్ చేశానని, దీంతో తన భర్తకు, కుమారుడికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ కు భారతీదేవి ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కమిషనర్ ను కోరారు.

  • Loading...

More Telugu News