BJP: బీజేపీతో పొత్తుతో ఒక్క ఓటు కూడా పెరగలేదు: చంద్రబాబు కీలక వ్యాఖ్య

  • పొత్తుకుముందే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాం
  • అప్పుడెన్ని ఓట్లు వచ్చాయో, పొత్తు తరువాతా అన్నే ఓట్లు
  • బీజేపీతో స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదు
  • వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

బీజేపీతో పొత్తుతో టీడీపీకి అదనంగా వచ్చిన లాభం ఏమీ లేదని చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 2014 సాధారణ ఎన్నికలకన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో వచ్చిన ఓట్లే, పొత్తు తరువాత కూడా వచ్చాయని, బీజేపీ వల్ల అదనంగా ఎటువంటి ఓట్లూ రాలేదని ఆయన అన్నారు. పొత్తు లేకుండా ఎన్ని ఓట్లు వచ్చాయో, పొత్తుతోనూ అన్నే ఓట్లు వచ్చాయని, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆ పార్టీతో స్నేహాన్ని కొనసాగించామని తెలిపారు.

 హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకూ దాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించిన ఆయన, యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని అన్నారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రుల రాజీనామాల తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, 98 శాతం మంది అభినందిస్తున్నారని ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News