చంద్రబాబులా ఎవరూ కష్టపడలేరు.. ఏపీకి ఆయన అవసరం ఉంది: అసెంబ్లీలో ఉద్వేగానికి లోనైన కామినేని
- రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు
- నేను అజాత శత్రువును
- శక్తి మేరకు అన్నీ చేశాను
తాను అజాత శత్రువునని అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన కాలంలో, అందరితోనూ తాను స్నేహంగానే మెలిగానని చెప్పారు. తన శక్తిమేరకు తన పరిధిలో అన్నీ చేశానని... కొన్ని చేయలేకపోయి ఉండవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కామినేని ఉద్వేగానికి లోనయ్యారు. తనకు మంత్రి పదవి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడే కారణమని చెప్పారు.