Chandrababu: అందరూ నాటకాలు ఆడారు... ఏం చెయ్యాలో నాకు తెలుసు: చంద్రబాబు

  • ప్రజల మనోభావాలను గౌరవించని స్నేహితులు ఎందుకు?
  • నాలుగు సంవత్సరాల ఓపిక నశించింది
  • ఎన్డీయే సర్కారు నుంచి వైదొలగడమే మంచిదని భావించా
  • మీడియా సమావేశంలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంలో కేంద్రంలోని బీజేపీ సహా ప్రతి ఒక్కరూ నాటకాలు ఆడారని, ఇక భవిష్యత్తులో ఏం చేయాలో తనకు తెలుసునని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని తమిళులు, కన్నడిగులతో పోల్చడం ఏంటని ప్రశ్నించిన ఆయన, నాలుగు సంవత్సరాల పాటు ఓపిక పట్టామని, ఇంకా వేచి చూడటం అనవసరమన్న ఆలోచనకు వచ్చేశామని తెలిపారు.

 ఎన్డీయే సర్కారు నుంచి వైదొలగి, ప్రజల్లోకి వెళ్లి జరిగిందంతా చెబుతానని ఆయన అన్నారు. పోలవరం సహా ఎన్నో అంశాల్లో ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్నో ఉన్నాయని వెల్లడించిన ఆయన, ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణినే అవలంబించిందని తెలిపారు. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఎంతగానో తాను చెప్పి చూశానని, అయినా పట్టించుకోలేదని విమర్శించారు.

ఇప్పటికే రాజీనామాలు చేయాలని కేంద్ర మంత్రులను ఆదేశించానని, తనకు దేశ రాజకీయాలకన్నా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, భవిష్యత్‌ కార్యాచరణను అతి త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. గురువారం నాడు సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజులు రాజీనామా చేస్తారని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో తాను ఎటువంటి నిర్ణయాన్నీ ఇంకా తీసుకోలేదని అన్నారు. 

  • Loading...

More Telugu News