కూలిన రష్యా విమానం... 32 మంది మృతి
- సిరియాలోని హిమిమిమ్ ఎయిర్ బేస్ లో ప్రమాదం
- రన్ వేకు 500 మీటర్ల దూరంలో మండిపోయిన విమానం
- ఆరుగురు సిబ్బంది, 26 మంది ప్రయాణికుల దుర్మరణం
కాగా, జరిగిన ప్రమాదంపై అధికారుల విచారణ మొదలైంది. ఈ ఘటన వెనుక విమానయాన రక్షణ నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అన్న కోణంతో పాటు, ల్యాండింగ్ సమయంలో తేలికపాటి క్షిపణి ప్రయోగం జరిగిందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, గత డిసెంబర్ లో ఈ ఎయిర్ బేస్ ను, ఇక్కడున్న రష్యా సైనిక స్థావరాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించిన సంగతి తెలిసిందే.