అమిత్ షాతో చర్చలకు యనమల పేరును కూడా చేర్చిన చంద్రబాబు!
- ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా
- చర్చలకు రావాలని సూచించిన బీజేపీ చీఫ్
- సుజనా, కుటుంబరావు, రామ్మోహన్ నాయుడు పేర్లు చెప్పిన చంద్రబాబు
- తాజాగా యనమల పేరును బృందంలో చేర్చిన బాబు
ఈ సాయంత్రం 5 గంటలకు విభజన హామీలపై చర్చ సాగనుండగా, తొలుత సుజనాచౌదరి, కుటుంబరావు, కింజరపు రామ్మోహన్ నాయుడులను పంపుతున్నట్టు వెల్లడించిన చంద్రబాబు, తాజాగా యనమలనూ వెళ్లాలని ఆదేశించారు. దీంతో బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ ముగియగానే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రజల్లోని ఆగ్రహం, నెరవేరాల్సిన విభజన హామీలు తదితరాలపై అమిత్ షాకు మరింత వివరంగా చెప్పాలంటే, యనమల ఉంటే మంచిదని సీఎం అభిప్రాయపడ్డట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.