: సీఎంతో బొత్స భేటీ
పీసీసీ ఛీఫ్ బొత్స సత్యన్నారాయణ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అధిష్ఠానం పిలుపు మేరకు సోమవారం ఢిల్లీ వెళ్లిన బొత్స పలువురు కాంగ్రెస్ పెద్దలను కలుసుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఢిల్లీ పర్యటన విశేషాలు, ఇతర అంశాలపై మాట్లాడుకునేందుకు వీరు సమావేశమయ్యారని తెలుస్తోంది.