KCR: రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం
- పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యూహంపై చర్చ
- ఎంపీలతో చర్చించనున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరగనుంది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్టు ఓ ప్రకటన విడుదలైంది.
ఈ నెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్చలపై టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ లోక్ సభ, రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలకు ఈ మేరకు ఆహ్వానం అందింది.