చంద్రబాబుతో సమావేశంలో ఎంపీలు తేల్చి చెప్పిందిదే!
- ప్రజల్లో వెంటనే ఆగ్రహాన్ని తగ్గించాలన్న సీఎం రమేష్
- తుది నిర్ణయం చంద్రబాబే తీసుకోవాలన్న ఎంపీలు
- హామీలు నెరవేరేంత వరకూ పోరాడదామన్న జయదేవ్
- ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసునన్న టీజీ
మరో ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ, ఏపీకి రావాల్సిన వాటా వచ్చేంత వరకూ పోరాడదామని వ్యాఖ్యానించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, అధినేత చంద్రబాబునాయుడు అనుభవజ్ఞుడని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని అన్నారు. రాష్ట్రానికి ఏం చేయాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న కేశినేని నాని, కాంగ్రెస్, వామపక్షాలు వీధి పోరాటాలు చేస్తున్నాయని, వాటితో ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తెద్దామని, బడ్జెట్ సమావేశాల్లో నిరసనలు కొనసాగిద్దామని సూచించారు. పవన్ కల్యాణ్ జేఎఫ్సీతోనూ ఎటువంటి లాభమూ లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. నిజా నిజాలను ప్రజలే నిర్ధారిస్తారని, అందుకోసం ఎవరూ అక్కర్లేదని నాని వ్యాఖ్యానించినట్టు సమాచారం.