Chandrababu: ప్రతీవారం కోర్టు కెళ్లి చేతులు కట్టుకుని నిల్చునే వ్యక్తి పోరాడతానంటే నమ్ముతారా?: చంద్రబాబు

  • పార్లమెంటులో వారికేమాత్రం బలం ఉందని రాజీనామా చేస్తారు?
  • పోలవరానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు
  • బడ్జెట్‌లో ఏపీ పేరు లేకున్నా బ్రహ్మాండంగా ఉందన్నారు
  • వైసీపీపై చంద్రబాబు ఫైర్

ప్రతీ శుక్రవారం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరై చేతులు కట్టుకుని నిల్చునే వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడతాను, రాష్ట్రం కోసం పోరాడతానంటే జనాలు నమ్మే పరిస్థితులు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ తాము అవిశ్వాసం పెడతామని, టీడీపీ కూడా కలిసి రావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు చంద్రబాబు పై విధంగా స్పందించారు.

పార్లమెంటులో వారికున్న బలం ఏపాటిదని ప్రశ్నించారు. ప్రతీవారం కోర్టుకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చునే వ్యక్తి పోరాడతానంటే నమ్మే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి వైసీపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏపీ పేరు లేకున్నా పొగిడిన వైసీపీకి అసలు మాట్లాడే అర్హతే లేదన్నారు.

అసలు వైసీపీ వారు ఎక్కడి నుంచి వచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అదే పనిగా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రంతో తామెక్కడా రాజీపడడం లేదని, పోరాడుతూనే ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News