Chandrababu: ఇక కదలండి.. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు కీలక ఆదేశాలు

  • తెలంగాణలో లక్ష మందితో మహానాడు
  • పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమం మొదలుపెట్టండి
  • తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటాను
  • ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తాను

తెలంగాణ టీడీపీ నాయకులకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది నిర్వహించే మహానాడులోగా మూడు బహిరంగ సభలు నిర్వహిస్తామన్న టీటీడీపీ నేతల ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పారు. త్వరలోనే లక్ష మందితో తెలంగాణలో మహానాడును నిర్వహించాలని చెప్పారు. పార్టీ శ్రేణుల భవిష్యత్తుపై భరోసా తీసుకునే బాధ్యత రాష్ట్ర నాయకులదేనని చంద్రబాబు తెలిపారు.

ఏయే కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారో ఆయా కార్యక్రమాల ప్రణాళిక వేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పారు. కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపాలని పేర్కొన్నారు. పల్లెపల్లెకు టీటీడీపీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటానని, టీడీపీలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.  

  • Loading...

More Telugu News