KCR: కేంద్ర నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారు: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఆరోపణలు
- అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలయినా ఏమీ చేయలేదు
- ఇప్పుడు మాటల గారడీ చేస్తున్నారు
- కాంట్రాక్టర్లకు లాభాల కోసమే పని చేస్తున్నారు
- కాంట్రాక్టు ఉద్యోగులు, సింగరేణి వారసత్వ ఉద్యోగాల వంటి సమస్యల సంగతి ఏమైంది?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు చూపాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు మాటల గారడీ చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారు కాంట్రాక్టర్ల లాభాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు, సింగరేణి వారసత్వ ఉద్యోగాల వంటి సమస్యల సంగతి ఏమైందని ఆయన నిలదీశారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్ విమర్శలు చేశారని, ఆయన మాట్లాడే తీరు పరాకాష్టకు చేరిందని అన్నారు.