: పాక్ ఖైదీపై దాడి విషయంలో కేంద్రానికి సుప్రీం అక్షింతలు


జమ్మూ జైల్లో పాకిస్తానీ ఖైదీ సనావుల్లా రంజాయ్ పై దాడిని ముందే నిలువరించేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని నేడు సుప్రీం ప్రశ్నించింది. సనావుల్లాను విడుదల చేసి పాక్ పంపించాలంటూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

భారత జైళ్ళలో పాక్ ఖైదీలపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నా నిర్లిప్తంగా వ్యవహరించారని పేర్కొంది. దాడిని అరికట్టేలా చర్యలు ఎందుకు తీసుకోలేదో సంజాయిషి ఇవ్వాలని కేంద్రంతో పాటు కాశ్మీర్ ప్రభుత్వాన్ని కూడా కోరింది. అంతేగాకుండా, సనావుల్లాపై కోట్ బల్వాల్ జైల్లో దాడి జరిగినప్పుడు విధుల్లో ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలపాలని స్పష్టం చేసింది. ఇక సనావుల్లా విడుదలపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ, పాక్ ఖైదీ శిక్షా సమయం పూర్తి కాలేదని పిటిషన్ ను తోసిపుచ్చింది.

  • Loading...

More Telugu News