: 'మ్యాజిక్ ఫిగర్' చేరుకున్న కాంగ్రెస్


కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్సష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఈ మధ్యాహ్నానికి కాంగ్రెస్ 113 స్థానాలను హస్తగతం చేసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం హోదాకు బీజేపీ, జేడీఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. బీజేపీ ప్రస్తుతం 38 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 37 స్థానాలను కైవసం చేసుకుంది. యడ్యూరప్ప పార్టీ కేజేపీ 4 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇతరులు 14 స్థానాల్లో జయభేరి మోగించారు. కర్ణాటకలో మొత్తం 223 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓ స్థానంలో బీజేపీ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదాపడింది.

  • Loading...

More Telugu News