ఐదవ నెంబరు స్థానంలో కుదురుకోవడం చాలా కష్టం! -మనీశ్ పాండే
- రిజర్వ్ బెంచ్ లో కూర్చోవడం కష్టం
- టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది
- ఐదో నెంబర్ కంటే ముందు బ్యాటింగ్ కి వస్తే మరిన్ని పరుగులు చేస్తాను
అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాలో స్థానం కావాలంటే ఆమాత్రం వేచి చూడాల్సిందేనని చెప్పాడు. ఇక టీమిండియా తరపున ఎన్నో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు బ్యాటింగ్ కు దిగిన ఐదో నంబర్ స్థానం చాలా క్లిష్టమైనదని చెప్పాడు. ఈ స్థానంలో తాను నిలదొక్కుకుంటున్నప్పటికీ భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ లో తన కంటే కోహ్లీ, ధోనీ వంటి వారు ముందున్నారని, అంతేకాకుండా మన టాప్ ఆర్డర్ 30 నుంచి 35 ఓవర్లు బ్యాటింగ్ చేస్తోందని చెప్పాడు. టాపార్డర్ అంత నిలకడగా ఆడుతున్నప్పుడు తనకు ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే వెసులుబాటు ఉండదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో తాను ఇంకా ముందుగా వస్తే మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంటుందని మనీశ్ పాండే తెలిపాడు.