ఫిబ్రవరీ 22.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది!: సినీ హీరో నితిన్ జయం సినిమా జ్ఞాపకాలు
- 2002లో ఇదే రోజున నా తొలి సినిమా 'జయం' షూటింగ్ ప్రారంభం
- దర్శకుడు తేజకు కృతజ్ఞతలు
- అలాగే, తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు
కాగా, తెలుగుచలన చిత్ర పరిశ్రమకు లభించిన సృజనాత్మక దర్శకులలో తేజ ఒకరని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'నేనేరాజు నేనే మంత్రి' చిత్రంతో మళ్లీ విజయపథంలోకి వచ్చిన ఆయన.. ఇకపై కూడా విజయాలు సాధించాలని అభిలషిస్తున్నానని, తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న తన మెంటర్, డైరెక్టర్ తేజకి హ్యాపీ బర్తే అంటూ సినీ నటి కాజల్ కూడా శుభాకాంక్షలు తెలిపింది. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసింది.