: సోనియమ్మకు ఆనందమానందమాయెనే..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం దిశగా దూసుకుపోతుండడం పట్ల అధినేత్రి సోనియాగాంధీ ఆనందంతో పొంగిపోతున్నారు. అందరూ ఒక్కతాటిపై నిలిచి పార్టీ విజయానికి కృషి చేశారని సోనియా ప్రశంసించారు. అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న విషయం ఆమె దాటవేశారు. పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను మోపారు.