రాంగోపాల్ వర్మ మెడకు బిగుస్తున్న ఉచ్చు... మరిన్ని సెక్షన్ల కింద కేసులు!
- ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందేనంటున్న మహిళా సంఘాలు
- ఐటీ చట్టాన్ని చేర్చిన పోలీసులు
- వర్మపై బీజేపీ నేత తుమ్మలపల్లి పద్మ కేసు
వర్మపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తుండగా, తాజాగా, తనపై వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారని, కేసు పెడతానని ఆన్ లైన్లో బెదిరిస్తున్నారని బీజేపీ మహిళా నేత తుమ్మలపల్లి పద్మ మరో కేసు పెట్టారు. తాను టీవీ చానల్ లో పాల్గొని వర్మ చేస్తున్న పనులపై మహిళల అభిప్రాయాలను బయటపెట్టానని, అందుకు తనను ఆయన వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అందుకు ప్రాథమిక ఆధారాలు సేకరించి మరో కేసు నమోదు చేశారు.