: అందరి నోట రాహుల్ మాట
కర్ణాటకలో కాంగ్రెస్ హవా వీస్తుండడంతో ఇప్పుడందరి నోట రాహుల్ నామస్మరణ వినిపిస్తోంది. బీజేపీ దిగ్గజం నరేంద్ర మోడీ ప్రభావాన్ని సైతం అధిగమించి కర్ణాటకలో కాంగ్రెస్ ను అందలం ఎక్కించడం వెనుక రాహుల్ కృషి ఉందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. కన్నడనాట ఎన్నికల్లో రాహుల్ గాంధీ చురుకైన పాత్ర పోషించారని కితాబిచ్చారు. ఎన్నికల ఫలితాల పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ కు ప్రధాని ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలియజేశారు.