: కాంగ్రెస్ హస్తానికి 107


కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 107 స్థానాలలో విజయ దుందుభి మోగించింది. మరో 6 స్థానాలు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ కాంగ్రెస్ సొంతం అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఇంకా 13 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 36 స్థానాలలో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 35 చోట్ల గెలవగా 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కర్ణాటక జనతాపార్టీ 3 స్థానాలు గెలుచుకుని మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరలు 13 స్థానాలలో గెలుపొందారు.

  • Loading...

More Telugu News