Chandrababu: బుల్లి రామయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు
- బుల్లిరామయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత
- టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి రామయ్య ఎనలేని సేవలు చేశారు
- ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు: చంద్రబాబు
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్యకు సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుల్లి రామయ్య భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. బుల్లి రామయ్య కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఆయన ఎనలేని సేవలు చేశారని, ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. కాగా, బుల్లి రామయ్య ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు.