లగ్జరీ బైక్ ప్రియులకు శుభవార్త.. ధరలు గణనీయంగా తగ్గనున్నాయ్!
- లగ్జరీ బైక్‌లపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం
- కస్టమ్స్ డ్యూటీ 50 శాతానికి పరిమితం
- పూర్తిగా విదేశాల్లో అసెంబుల్ అయిన వాటికి మాత్రమే వర్తింపు
నిజానికి హైఎండ్ బైక్‌లు భారత్‌లో ఉత్పత్తి కావడం లేదు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వీటిపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం తాజాగా దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సుంకం సగానికి సగం తగ్గిపోవడంతో బైక్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.