ambathi: ఓట్లు తొలగించారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు!

  • సత్తెనపల్లిలోనే పదిహేను వేల ఓట్లు గల్లంతయ్యాయి
  • నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయి
  • మీడియాతో అంబటి రాంబాబు

ఏపీ ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఈరోజు ఫిర్యాదు చేశారు. సిసోడియాను కలిసిన వారిలో అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

 అనంతరం, అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, సత్తెనపల్లిలోనే పదిహేను వేల ఓట్లు గల్లంతయ్యాయని, ఆ ఓట్లన్నీ వైసీపీ నేతలవేనని, నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొంత మంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుతో కుమ్మక్కయ్యారని, అలాంటి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబసభ్యుల ఓట్లను తొలగించారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటును మరో వార్డుకు మార్చారని విమర్శించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఆ ఓట్లను తొలగించారని, న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News