పార్లమెంటులో ఏనాడైనా వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి నిరసన తెలిపారా?: సీఎం రమేశ్
- పార్లమెంటులో రేపు కూడా ఆందోళన కొనసాగిస్తాం
- ఏపీకి కేంద్రం నుంచి ప్రయోజనాలు అందకుండా వైసీపీ అడ్డు పడుతోంది
- ఏపీకి ఏ మాత్రం మేలు జరగకుండా ఉండాలనేదే వైసీపీ ఆలోచన
- విభజన హామీలపై మరింత స్పష్టత ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాం
నిన్న తనను రాజ్యసభలో మార్షల్స్ బయటకు తీసుకెళుతుంటే అందరూ ఖండిస్తోంటే వైసీపీ ఎంపీ మాత్రం ఏమీ అడగలేదని అన్నారు. ఏపీకి ఏ మాత్రం మేలు జరగకుండా ఉండాలనేదే వైసీపీ ఆలోచనని సీఎం రమేశ్ చెప్పారు. పార్లమెంటులో తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. విభజన హామీలపై మరింత స్పష్టత ఇవ్వాలని గట్టిగా కోరుతున్నామని చెప్పారు.