ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫ్లో ఆవిష్కరణ... నేటి నుంచే బుకింగ్... ధర రూ.74,740
- ఒక్క రీచార్జ్ తో 80 కిలోమీటర్ల మైలేజీ
- గరిష్ట వేగం 60 కిలోమీటర్లు
- ముందుగా బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ నుంచి డెలివరీ
రోజుకు 300 వాహనాల తయారీతో కార్యకలాపాలు ఆరంభించనున్నామని కంపెనీ సీఈవో ప్రవీణ్ ఖర్బ్ ప్రకటించారు. ఈ స్కూటర్ లో జియో ఫెన్సింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. నిర్ణీత సరిహద్దులు దాటి స్కూటర్ బయటకు వెళ్లిందంటే అలర్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా స్కూటర్ ను తస్కరించి తీసుకెళెతుంటే అప్రమత్తం చేస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీని గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. వాహనాలకు ముందస్తు బుకింగ్ లు నేటి నుంచి ప్రారంభం కాగా, ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ వెబ్ సైట్ చిరునామా http://www.22motors.in/