BJP: ముస్లింలు పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లిపోవాలి: వినయ్ కటియార్

  • అసదుద్దీన్ వ్యాఖ్యలకు వినయ్ కటియార్ కౌంటర్
  • ముస్లిం జనాభా ఆధారంగా దేశాన్ని విభజించారు
  • ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్నే ఏర్పాటు చేశారు

ముస్లింలు భారత్‌ లో నివసించకూడదని బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ సూచించారు. భారతీయ ముస్లింలను పాకిస్ధానీలని సంబోధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం జనాభా ఆధారంగా దేశాన్ని విభజించారని అన్నారు.

అలాంటప్పుడు ముస్లింలకు ఇక్కడేం పని? ఇక్కడ వారెందుకు ఉంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేశారు కదా? అని ఆయన అన్నారు. భారత్ లోని ముస్లింలు పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌ వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News