Telugudesam: రేపు మేము కూడా రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలు చేస్తాం: టీడీపీ కీలక నిర్ణయం

  • ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటానికి మ‌ద్ద‌తుగా ప్ర‌ద‌ర్శ‌న‌లు
  • మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శ‌నలు 
  • ప్రతిపక్ష పార్టీలు కూడా బంద్‌కు పిలుపు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అన్యాయం జ‌రిగిన విష‌యాన్ని టీడీపీ నేత‌లు, రాష్ట్ర ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతోన్నారు. ఓ వైపు ప్ర‌తిప‌క్ష పార్టీలు రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు టీడీపీ కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేపు రాష్ట్ర‌ వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఈమేరకు ఏపీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు మీడియాతో మాట్లాడుతూ... రేపు రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శ‌నలు ఉంటాయ‌ని తెలిపారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటానికి మ‌ద్ద‌తుగా ఈ  ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News