YSRCP: టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి పేజీ ఒక మోసం: వైసీపీ అధినేత జగన్

  • నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర
  • ఏ అవకాశాన్నీ రాజకీయంగా మలచుకునేందుకు చంద్రబాబు వెనుకడుగు వేయరు
  • కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయంపై మీడియా ముందుకు   చంద్రబాబు రారే?
  • ప్రశ్నలు గుప్పించిన జగన్

2014 టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి పేజీ ఒక మోసమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హసనాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లింలతో ముఖాముఖీగా మాట్లాడారు. అనంతరం, జగన్ మాట్లాడుతూ, ఈ మేనిఫెస్టో గురించి ఇంటర్నెట్ లో వెతికితే ఎక్కడా కనిపించదని, ప్రతి పేజీ ఒక మోసానికి నిదర్శనంగా ఉండటంతో దానిని తొలగించారని విమర్శించారు.

ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, ఏ ఒక్క అవకాశాన్నీ రాజకీయంగా మలచుకునేందుకు చంద్రబాబు వెనుకడుగు వేయరని, మరచిపోతారని విమర్శించారు. మీడియా ముందు గంటలు గంటలు మాట్లాడే చంద్రబాబు, కేంద్ర బడ్జెట్ ప్రకటించి ఇన్ని రోజులైనా దాని గురించి మాట్లాడేందుకు మాత్రం మీడియా ముందుకు రావటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో మాత్రం లీకుల్ ఇప్పిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ‘కేంద్ర మంత్రులు ఆమోదించిన తర్వాతనే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. టీడీపీకి సంబంధించిన ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి, ఈ మంత్రులు కూడా ఆమోదించిన తర్వాతనే కదా బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేది? ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? ఆయనకు తెలియకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారా?’ అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News